శ్రీశైలం ఆలయంలో ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 12 వరకు శ్రావణ మాసోత్సవాలు జరగనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనల్లో మార్పులు చేశారు. శని, ఆది, సోమవారాల్లో ఈ సేవలను పూర్తిగా నిలిపివేశారు. మిగతా రోజుల్లో మూడు విడతల్లో సేవలు కొనసాగుతాయి. ఆగస్టు 18, సెప్టెంబర్ 1, 8న ఉదయం గర్భాలయ అభిషేకాలు ఉండవు. శ్రావణ మాసంలోని 2, 3, 4వ శుక్రవారాల్లో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు.