సనాతన ధర్మాన్ని పాటిస్తూ చాలా మంది శ్రావణ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీనికి పలు సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో కోళ్లు, ఇతర జంతువులకు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఇటు సూర్యరశ్మి తక్కువగా ఉండటంతో శరీరంలో జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తి మందగిస్తుంది. ఇలాంటప్పుడు మాంసం తినడంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.