శుభాంశు రోదసి యాత్ర మరోసారి వాయిదా

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర మరోసారి వాయిదా పడింది. సాంకేతిక సమస్యతో యాత్రను వాయిదా వేస్తున్నట్లు స్పేస్‌ఎక్స్ తెలిపింది. రాకెట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా ప్రయోగం వాయిదా పడినట్లు తెలిపింది. మరమ్మతులకు సమయం పడుతుందని.. త్వరలోనే కొత్త లాంచ్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. ప్రయోగ వాయిదా విషయాన్ని ఇస్రో కూడా ధ్రువీకరించింది. కాగా యాక్సియం-4 మిషన్ మంగళవారం నుంచి వాయిదా పడుతూ వస్తోంది.

సంబంధిత పోస్ట్