అమెరికా వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ చేపట్టిన రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో శుభాంశు శుక్లా బృందం రోదసిలోకి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రయోగం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. జూన్ 22న ఈ యాత్ర ఉంటుందని ఇటీవల ప్రకటించగా.. తాజాగా మరోసారి వాయిదా వేస్తున్నట్లు నాసా ప్రకటించింది. ప్రయోగ తేదీని త్వరలో వెల్లడిస్తామని చెప్పింది.