శుభ్‌మన్ గిల్ రనౌట్.. కష్టాల్లో భారత్ (వీడియో)

లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. టీమిండియా కెప్టెన్ 21 పరుగులకే ఔట్ అయ్యారు. అట్కిన్సన్ వేసిన 27.2 ఓవర్‌ను ఎదుర్కొన్న గిల్ పరుగు కోసం యత్నించాడు. కానీ, బౌలర్‌ బంతిని అందుకుని స్ట్రైకర్స్ ఎండ్‌లో రనౌట్ చేశాడు. 29 ఓవర్లకు భారత్ స్కోర్ 85/3గా ఉంది. క్రీజులో కరుణ్‌ నాయర్ (0), సాయి సుదర్శన్ (28) ఉన్నారు. వర్షం కారణంగా ఆటకు మరోసారి అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్