శుక్ర మౌఢ్యమి.. ఈ శుభకార్యాలు చేయొద్దు!

ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 17 వరకు శుక్ర మౌఢ్యమి ఉంటుందని పండితులు తెలిపారు. శుభాలకు అధిపతులైన గురు, శుక్రుడు ఈ మూఢాల్లో సూర్యుడికి సమీపంగా రావడంతో శక్తిని కోల్పోతారని పేర్కొన్నారు. మొత్తం 84 రోజులు ఈ శుక్ర మౌఢ్యమి కొనసాగుతుందన్నారు. ఈ రోజుల్లో పెళ్లి, పుట్టు వెంట్రుకలు తీయడం, వాహనాల కొనుగోళ్లు, గృహప్రవేశాలు, యాత్రలు తదితర శుభకార్య పనులు చేయకూడదని సూచించారు. నిత్యారాధన, సీమంతాలకు ఈ దోషం వర్తించదని పండితులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్