TG: ఆదిలాబాద్ జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. బజార్‌హత్నూర్ మండల ఎస్‌ఐ రమేష్ లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దోరికిపోయారు. ఓ కేసు విషయంలో ఎస్ఐ రూ.50 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి.