TG: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మజిపేటలో ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ట్రాక్టర్, జేసీబీని ఇవ్వడానికి SI లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ట్రాప్ వేసి హరిప్రసాద్ రెడ్డిని పట్టుకున్నారు. దీంతో ఎస్సై బాధితులు అంబేద్కర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. చాలామందిని డబ్బులకు పీడించాడని, దారుణంగా కొట్టేవాడని బాధితుల ఆరోపించారు.