గుండెపోటుతో ఎస్‌ఐ మృతి

TG: హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్టేషన్‌లో ఎస్ఐ సంజయ్ సావంత్ (58) గుండెపోటుతో మృతిచెందారు. బుధవారం అబ్దుల్లాపూర్మెట్‌లో ఎన్నికల విధులకు వెళ్లాల్సిఉండటంతో మంగళవారం రాత్రి ఆయన పీఎస్‌లోనే నిద్రించారు. ఈ క్రమంలో ఎస్ఐకి గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. కాగా ఎస్‌ఐ సంజయ్ నాచారంలో నివాసం ఉంటున్నారు. ఎస్సై మృతితో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్