AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ఎస్ఐ చౌడయ్య కారు బీభత్సం సృష్టించింది. బైక్‌పై వెళ్తున్న ఉప్పుమాగులూరుకి చెందిన వీరయ్య, మద్దిరాలకు షేక్ మస్తాన్ వలీలను ఎస్ఐ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరయ్య మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.