కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా చర్చించుకుంటున్న నాయకత్వ మార్పు వ్యవహారం గురువారం కీలకమైన దశకు చేరుకుంది. ఇవాళ సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయనకు రాజ్యసభ సీటుతో పాటు జాతీయ రాజకీయాల్లో కీలక ప్రాధాన్యత కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధరామయ్య నో చెప్పారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాబోయే రెండేళ్లు కర్ణాటకలోనే MLAగా కొనసాగుతానని ఆయన అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం.