యూసుఫ్ పురాలో భూ వివాదం.. వితంతువుపై దాడి

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం యూసుఫ్ పురాలో బుధవారం భూ వివాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జగదీశ్వరి భర్త నరసింహారెడ్డి 9 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, ముగ్గురు కూతుళ్లు, కొడుకుతో కలిసి జీవనం సాగిస్తోంది. తన పేరుపై ఉన్న సుమారు 19 ఎకరాల భూమే తమకు ఆధారమని ఆమె చెబుతోంది. తన భూమిలో పత్తి ఏరుతుండగా కొంతమంది వ్యక్తులు అడ్డుకుని గొడవకు దిగారని, దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితురాలు రాయికోడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు ప్రాణహాని ఉందని, తన పిల్లలకు రక్షణ కల్పించి తన భూమికి న్యాయం చేయాలని వేడుకుంటోంది. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕