రైలాపూర్ గేటు వద్ద బైక్ ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు

కౌడిపల్లి మండలం రైలాపూర్ గేటు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన రవి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఈఎంటీ రాజు, పైలట్ జగన్ అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం గాయపడిన రవిని నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్