సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో బుధవారం చెరుకు ముత్యం రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా ఎల్లన్న వంశవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెరుకు ముత్యం రెడ్డి దుబ్బాక నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసిన గొప్ప నాయకుడని, ఆయన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. రైతులకు రుణమాఫీ, చెక్ డ్యాముల నిర్మాణం ద్వారా కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు అభిమానులు పాల్గొన్నారు.