వర్షాలు కురవాలని రామకోటి సంస్థ ఆధ్వర్యంలో అభిషేకాలు

ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలోని రామాలయంలోని సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించి వేడుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే రైతులు ఆనందంగా ఉంటారని, పాడి పంటలు పండుతాయని, దీని ఆధారంగానే వ్యవసాయం ముందుకు సాగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్