సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఒకే కారులో పక్కపక్కన కూర్చుని ప్రయాణించారు. అనంతరం కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.