పాడి రైతులకు కరీంనగర్ డైరీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మేనేజర్ సాయికుమార్, అసిస్టెంట్ మేనేజర్ రాజా గౌడ్ లు అన్నారు. బుధవారం అక్బరుపేట భూంపల్లి మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన పాడి రైతు గోపరి యాదగిరి శారదా కూతురు అఖిల వివాహానికి కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో పుస్తె- మట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ రైతుల కోసం చేపట్టిన కళ్యాణమస్తు పథకంలో ఆడబిడ్డ పెళ్ళికి పుస్తే- మట్టెలు అందజేశామన్నారు.