దుబ్బాక నియోజకవర్గం అక్బర్ పేట భూంపల్లి మండలంలో మాజీ మంత్రి, దుబ్బాక శాసనసభ సభ్యుడు చెరుకు ముత్యం రెడ్డి ఏడవ వర్ధంతి కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ ఎల్లన్న వంశీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న రైతులకు, గూడు లేని ప్రజలకు ఎనలేని సేవలు చేసారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.