ప్రయాస్-2025కు జాతీయస్థాయిలో ఎంపికైన దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్ విద్యార్థులు ఎండి అజీజ్, బానోత్ శివలను సోమవారం జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సన్మానించారు. రాష్ట్రం నుండి జాతీయస్థాయికి ఎంపికైన ఏకైక పాఠశాల సిద్దిపేట జిల్లాకు చెందినదని డీఈఓ అన్నారు. గతంలో ఇస్రో పరిశోధనా శిక్షణాకేంద్రానికి కూడా ఇదే పాఠశాల నుండి విద్యార్థులు ఎంపికయ్యారని గుర్తు చేశారు.