సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని ఖాజీపూర్ గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన SGF జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చేతుల మీదుగా అభినందన సన్మానం జరిగింది. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ అంజయ్య, పీటీలు, విద్యార్థులు పాల్గొన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే సూచించారు.