విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. గాడిలో పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వమని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్ అన్నారు. గురువారం అక్బర్ పేట-భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ విద్యావ్యవస్థను కేజీ టూ పీజీ అని చెప్పి విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.