కనుమరుగవుతున్న జానపద కళారంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంరెడ్డి అన్నారు. వండర్ బుక్ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకున్న మిరుదొడ్డిలోని సీతారామచంద్ర స్వామి ఆలయ భజన మండలి సభ్యులను ఆలయ కమిటీ చైర్మన్ తోట కమలాకర్రెడ్డి నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. ఆధ్యాత్మిక భజన మహోత్సవం నిర్వహించిన కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కిందన్నారు.