దౌల్తాబాద్: అర్హులైన వారు పథకాన్ని వినియోగించుకోవాలి

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన బొల్లి లచ్చయ్య తండ్రి మల్లయ్యకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మంజూరైన రూ. 60 వేల చెక్కును శనివారం గ్రామ సర్పంచ్ పంజ స్వామి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి సహకారంతో అందజేశారు. ఈ సందర్భంగా, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తోందని, అర్హులైన వారు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్