దౌల్తాబాద్: ఘనంగా హోలీ సంబరాలు

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో హోలీ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో గులాల్ చల్లి, డీజే సంగీతానికి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం పరస్పరం రంగులు రాసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ప్రజలు సౌభ్రాతృత్వ వాతావరణంలో పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్