సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముబారస్పూర్ 33కేవీ ఫీడర్ పరిధిలోని దొమ్మాట, దౌల్తాబాద్, గోవిందాపూర్, అహ్మద్ నగర్ గ్రామాలలో నేడు శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఏఈ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం, విద్యుత్ ఉపకేంద్రాలకు వెళ్లే తీగల మరమ్మతుల పనుల కారణంగా ఈ అంతరాయం కలుగుతుంది. ఈ సమాచారాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.