కొనయపల్లిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

దౌల్తబాద్ గ్రామపంచాయతీ పరిధి కొనయపల్లిలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు. అర్హత పొందిన లబ్ధిదారులకు అధికారులు, ప్రజాప్రతినిధులు రేషన్ కార్డులను అందజేశారు. కొత్త రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ జీ పీ వో రాఘవేందర్, గ్రామ కార్యదర్శి సునయన రాణి, ఉపసర్పంచ్ శ్యామల, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕