కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దు.. వెంకటయ్య

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సోమవారం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని అన్నారు. అక్బరు పేట-భూంపల్లి, మిరుదొడ్డి మండలాల్లోని పోతారెడ్డి, చెప్యాల, మల్లుపల్లి గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని ఐకేపీ నిర్వాహకులను ఆదేశించారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి కనీస మద్దతుధర పొందాలని సూచించారు.

సంబంధిత పోస్ట్