కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయడాన్ని నిరసిస్తూ జాతీయ సంఘాలు బుధవారం 'బ్లాక్ డే' పాటించాలని పిలుపునిచ్చాయి. దుబ్బాక ఆర్టీసీ కార్మికులు కూడా ఏప్రిల్ 1న యూనియన్ లకు అతీతంగా ఈ నాలుగు లేబర్ కోడ్ ల అమలును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో 'బ్లాక్ బ్యాడ్జిలు' ధరించి విధులకు హాజరు కావాలని, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం. థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండి మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, యాదగిరిలు పిలుపునిచ్చారు.