దుబ్బాక: యూరియా కార్డుల పంపిణితో దళారుల నిర్మూలన

సిద్ధిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం రైతులకు యూరియా కార్డులను తొగుట మార్కెట్ కమిటీ ఛైర్మెన్ చెరుకు విజయ్ రెడ్డి మరియు దుబ్బాక ఆత్మ కమిటీ ఛైర్మెన్ గాంధారి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్డుల ద్వారా యూరియా పంపిణీలో దళారుల నిర్మూలన జరుగుతుందని, పంట సాగు చేసిన రైతులకు మాత్రమే యూరియా అందుతుందని తెలిపారు. ఈ యూరియా కార్డులు అన్ని గ్రామాలలో వ్యవసాయ విస్తరణ అధికారుల ఆధ్వర్యంలో పంపిణీ చేయబడతాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్