దుబ్బాక: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాల్లో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి, కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ, రైతులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఒకే రకమైన పంటను కాకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని, ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సబ్సిడీపై పరికరాలు, పంట రుణాలు అందిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్