సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కె. రమేష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పారదర్శకంగా అమలు చేయడం, ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఈ సభలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాలకు కొత్త దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.