దుబ్బాక: బైక్ ను ఢీ కొట్టిన లారీ..ఇద్దరికి తీవ్ర గాయాలు

మిరుదొడ్డి మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎనగుర్తి గ్రామానికి చెందిన ప్రభాకర్, చిన్న ముత్యాల ప్రసాద్ అనే ఇద్దరు యువకులు అక్బర్పేట- భూంపల్లి క్రాస్ రోడ్డు వద్ద బైకుపై వెళ్తుండగా, సిద్దిపేట నుంచి మెదక్ వైపు అతి వేగంగా వస్తున్న లారీ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్