ప్రభుత్వంపై దుబ్బాక ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం కక్షపూరిత చర్య అని ఆరోపించారు. ఆదివారం సిద్దిపేటలో నిర్వహించిన బైక్ ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సాధించిన నాయకుడిని వేధిస్తున్నారని, ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ చర్యలతో ప్రజలు ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్