దుబ్బాక: సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం అక్బర్పేట-భూంపల్లి మండలం భూంపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాల వద్ద, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు. అనంతరం ఖాజీపూర్, బేగంపేట గ్రామాలకు వెళ్లే రహదారిలో కల్వర్టు నిర్మాణానికి కూడా భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ జెన్నా రెడ్డి, ఇరిగేషన్ ఈఈ శంకర్, డీఈఈ శీరీష తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్