సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేటలోని అంగన్‌వాడీ సెంటర్‌లో విద్యార్థులకు కుళ్లిన గుడ్లు అందించడంతో ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో కాలం చెల్లిన బలామృతం, పప్పు, చింతపండు, నూనెతో పాటు ఇతర ఆహార పదార్థాలు అధికారులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అంగన్‌వాడీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, టీచర్, ఆయాని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.