దుబ్బాక: 'దివ్యాంగుల జిల్లా మహాసభను విజయవంతం చేయాలి'

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు దివ్యాంగులకు రూ. 6, 016 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయడం లేదని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముక్కపల్లి రాజుమాదిగ అన్నారు. సోమవారం దుబ్బాకలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా పెన్షన్లు పెంచకపోవడం దారుణమన్నారు. దివ్యాంగుల హక్కుల సాధన కోసం ఈ నెల 16న సిద్దిపేటలో జరిగే మహాసభకు మంద కృష్ణమాదిగ హాజరవుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్