దుబ్బాక పట్టణంలో గురువారం బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీలు, రాజకీయాలను పక్కన పెట్టి 42 శాతం రిజర్వేషన్ల లక్ష్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నేడు తలపెట్టిన తెలంగాణ బంద్‌ను జయప్రదం చేయాలని, పార్టీలకతీతంగా ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు పాల్గొన్నారు.