సామాజిక న్యాయం, రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా, "ఎవరి కులం ఎంతో.! వారికంత వాటా.!" అనే నినాదంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూన్ 5న సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కరపత్రం ఆవిష్కరణ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు ర్యాగట్ల చందు తెలిపారు. తెలంగాణలో ప్రజల జనాభా లెక్కల ప్రకారం అన్ని రంగాలలో సమాన వాటా దక్కాలని డిమాండ్ చేస్తూ ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.