సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని హబ్సిపూర్ లోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను గురువారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని, పాఠశాలలో మౌళిక వసతులు కల్పించేలా ఉన్నతాధికారులకు విన్నవిస్తానని తెలిపారు. పాఠశాలలో ప్రహరీ, మరుగుదొడ్లు, క్రీడా ప్రాంగణం నిర్మించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.