ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైన శనివారం దుబ్బాక పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక పట్టణానికి చెందిన కారంకంటి గంగ కూలీ పని చేస్తూ కుమార్తెతో జీవనం కొనసాగిస్తుంది. రోజు మాదిరిగానే కూలీ పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.