దుబ్బాక మండలం పెద్దచీకోడ్ కు చెందిన ఎండీ. ఫయాజ్(22) అనే యువకుడు మద్యం మత్తులో తన బైక్ లో ఉన్న పెట్రోల్ ను తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ఈ నెల 16న ఈ ఘటన జరగగా, కుటుంబ సభ్యులు వెంటనే దుబ్బాక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి చిన్నాన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కీర్తిరాజు తెలిపారు.