తిమ్మాపూర్‌లో కరెంటు కష్టాలు.. రైతుల ఆవేదన

తిమ్మాపూర్‌లో విద్యుత్ సరఫరా సమస్యపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు ఆరు – ఏడు గంటల విద్యుత్ మాత్రమే అందుతుండటంతో సాగునీరు అందించడం ఇబ్బందిగా మారిందని తెలిపారు. రాత్రివేళల్లో పొలాలకు వెళ్లి పంటలకు నీరు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. పంటలు ఎండిపోతే కుటుంబ పోషణతో పాటు వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చడం కష్టమవుతుందని రైతులు వాపోయారు. తమ సమస్యను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, పంటలకు అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕