తోగుట మండలంలోని వెంకట్రావుపేట సర్పంచ్ కవిత స్వామీగౌడ్, ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువెళ్లి తప్పకుండా టీకాలు వేయించాలని ఆమె కోరారు.