పట్టా పాస్‌బుక్ ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి

దుబ్బాక డివిజన్ పరిధిలోని పట్టా పాస్‌బుక్ కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని దుబ్బాక డివిజన్ ఏడిఏ కాంపాటి మల్లయ్య తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించి మాట్లాడుతూ, రైతులు తమ ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ ఫోన్‌తో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. ఆధార్ ద్వారా దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చినట్లే, ప్రతి రైతుకు 11 అంకెల విశిష్ట సంఖ్య కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్