రైతులు తాము పండించే పంటలకు ఎరువుల వాడకాన్ని తగ్గించాలి

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని చందాపూర్ లో "రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" కార్యక్రమంలో భాగంగా, తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం, వ్యవసాయ శాఖల అధికారులు రైతులకు వానాకాలం సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ శ్వేత, రైతులు తాము పండించే పంటలకు రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి, సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలని, యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్