రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలో రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి హామీ కూలీలు బ్యాగరీ చంద్రవ్వ, గోప దేవవ్వ కుటుంబాలను బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, గాడిపల్లి ఫౌండేషన్ చైర్మన్ రఘువర్ధన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని అందేలాగా తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్