ఎర్లీబర్డ్ స్కీమ్ ద్వారా ఐదు శాతం రాయితీ: మున్సిపల్ కమిషనర్

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను ముందస్తు ఆస్తి పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం ఎర్లీబర్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. మున్సిపల్ కమిషనర్ రమేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆస్తిపన్ను చెల్లించే ప్రజలందరికీ 5 శాతం రాయితీ లభిస్తుంది. ఈ పథకం ద్వారా 5,410 గృహాల యజమానులు ప్రయోజనం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్