మెదక్ ఎంపీ రఘునందన్ రావు సోమవారం సిద్ధిపేట జిల్లాలోని తొగుట, వెలికట్ట, దుద్దెడ, గజ్వేల్ పరిధిలోని పిడిచెడ్లో, దౌల్తాబాద్ పరిధిలోని హైమద్ నగర్ తిరుమల కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీసీబీ ఉమ్మడి జిల్లా చైర్మన్ దేవేందర్రెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని, రైతులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి కొనుగోలు సజావుగా సాగేలా చూడాలని సూచించారు.