మహనీయులను స్మరించుకోవడం సమాజానికి ఎంతో అవసరము

ఈ నెల 30న సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలో జరగనున్న మహనీయుల ఉత్సవ సభ కరపత్రాన్ని మాజీ సర్పంచ్ తౌడ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మహనీయులను స్మరించుకోవడం సమాజానికి అవసరమని అన్నారు. మహాత్మా జ్యోతి రావు పూలే సామాజిక విప్లవానికి నాంది పలికారని, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్తగా పేదలు, బలహీన వర్గాలకు హక్కులు కల్పించి సమానత్వానికి పునాది వేశారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్