రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, సమాజాభివృద్ధి కోసం అంకిత భావంతో పని చేస్తేనే మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు. బుధవారం అక్బర్ పేట-భూంపల్లి మండల ఎంపీడీఓగా పనిచేసి బదిలీపై వెళ్తున్న ఎండీ జహూరుద్దీన్ ను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. అలాగే మండల ఎంపీడీఓగా బదిలీపై వచ్చి బాధ్యతలను చేపట్టిన సోమిరెడ్డికి స్వాగతం పలికారు. ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలందరికి చేరే విధంగా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.